హైదరాబాద్: తెలంగాణ జన జాగృతి కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితపై హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు పోలీసులు ఆమెపై శుక్రవారం తమంత తాముగా కేసు నమోదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని ఆమె తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారా కవిత ప్రజలను రెచ్చగొట్టారనేది ఆరోపణ.
అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలనే కవిత పిలుపుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాయలసీమకు చెందిన టీడీ వెంకటేష్ లాంటి కాంగ్రెసు శాసనసభ్యులు, నాయకులు ఆమెను తప్పు పట్టారు. కవితపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సినీ కళాకారులు, నిర్మాతలు, దర్శకులు కూడా అదర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి