విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కూడా కమిషనరేట్ పరిధిలో కోడిపందాలు జరగకుండా చర్యలు చేపట్టారు. దీంతో కమిషనరేట్ పరిధిలోగానీ, జిల్లాలోగానీ ఎక్కడా కోడిపందాలు వేసే అవకాశం లేకపోవడంతో పందెంరాయుళ్ళు గోదావరి జిల్లాకు తరలిపోయారు. భారీ వాహనాలతో సైతం బారులు తీరుతూ వెళ్ళినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఐ భీమవరం, ఉండి, చింతలపూడి, ములగలంపాడు తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో కోడిపందాలు జరుగనున్నట్లు సమాచారం అందడంతో వీరంతా ఆయా ప్రాంతాలకు తరలిపోయారు. భీమవరంలో ఏ లాడ్జి చూసినా ఒక్క గదికూడా ఖాళీ లేదని తెలుస్తోంది. నేడు కనుము కాబట్టి పందేలు ఇంకా జోరుగా జరిగే అవకాశముంది.
భారీ వాహనాల సమూహాలతోపాటు లక్షలాది రూపాయలతో ఈ పందాలకు తరలివెళ్ళారు. జిల్లాలో కోడిపందాలకు నూజివీడు ప్రాంతం ప్రసిద్ధి కాగా జిల్లా ఎస్పీ రామ కృష్ణయ్య కోడిపందాలు వేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక చేశారు. ఇదే సందర్భంలో నూజివీడు ఎఎస్పీ రాజకుమారి ఈ విషయంలో తీవ్రంగా స్పందించి కోడిపందాల వేసేవారి కదలికలు సైతం కనిపెడుతూ అటువారిపై చర్యలకు సిద్ధంగా ఉన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి