మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయుల కష్టాలు తీరడం లేదు. ఇండియన్ టాక్సీ డ్రైవర్ పై ప్రయాణికుడు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బల్లారత్ లోని విక్టోరియా నగరంలో ప్రయాణికుడు ఇండియన్ టాక్సీ డ్రైవర్ ను దుర్భాషలాడాడు, అతనిపై దాడి చేశాడు. వాహనాన్ని ధ్వంసం చేశాడు. గత రాత్రి ఇండియన్ టాక్సీ డ్రైవర్ పై దాడి చేసిన 48 ఏళ్ల ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. టాక్సీ డ్రైవర్ కు పెద్గగా గాయాలు కాలేదు.
ప్రయాణికుడు దుర్బాషలాడుతూ దాడికి పూనుకోవడంతో టాక్సీ డ్రైవర్ బల్లారత్ సర్వీసు స్టేషనులో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున గం. 2. 15 ని.లకు ఆశ్రయం పొందాడు.ప్రయాణికుడు సర్వీసు స్టేషనులోకి కూడా వెళ్లి టాక్సీ డ్రైవర్ పై దాడి చేశాడు. టాక్సీ కూడా దెబ్బ తిన్నట్లు పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి