శ్రీహరికోట: సూర్యగ్రహణ సమయంలో వాతావరణంలో ఏర్పడే వివిధ మా ర్పులను అధ్యయనం చేయడానికి శుక్రవారం భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) సౌండ్ రాకెట్లద్వారా ప్రయోగాలు చేసింది.ఈరోజు తిరువనంతపురం నుంచి ఆర్‌హెచ్ 300 మధ్యా హ్నం 12.20 గంటలకు, ఆర్ హెచ్ 300 మధ్యా హ్నం 1.05, ఆర్‌హెచ్ 200 మధ్యాహ్నం 1.07, ఆర్‌హెచ్ 200 మధ్యాహ్నం 3.00, ఆర్‌హెచ్ 300 సాయంత్రం 4.00 గంటలకు, శ్రీహరికోట నుంచి ఆర్‌హెచ్ 560 మధ్యాహ్నం 1.05కు ప్రయోగించనున్నారు.
ముందుగా ఈరోజు ఆర్‌హెచ్ 300 మధ్యా హ్నం 12.20 గంటలకు, ఆర్‌హెచ్ 300 మధ్యా హ్నం 1.05 గంటలకు రాకెట్లను ప్రయోగించారు. కాగా గురువారం తిరువనంతపురం నుంచి ఆర్‌హెచ్ 300 మధ్యాహ్నం 12.20,ఆర్‌హెచ్ 300 మధ్యాహ్నం 1.05గంటలకు, ఆర్‌హెచ్ 200 మధ్యాహ్నం 1.07, ఆర్‌హెచ్ 200 మధ్యా హ్నం 3.00 లకు ప్రయోగించారు. అలాగే 17వ తేదీ (శనివారం) ఆర్‌హెచ్ 560 మధ్యాహ్నం 1.07 గంటలకు ప్రయోగించనున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి