కోల్ కత్తా: సిపిఎం కురు వృద్ధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆరోగ్యం మరింత ఆందోళనకర పరిస్థితికి చేరుకుంది. బసు ఆరోగ్యం విషమంగా ఉందని, ఆక్సిజన్ ను మరింత పెంచినట్లు, గురువారం రెండు గంటల పాటు హీమో డయాలసిస్ నిర్వహించినా ఆక్సిజన్ స్థాయి పెంచాల్సి వచ్చినట్లు జ్యోతిబసుకు వైద్య చికిత్స అందిస్తున్న 8 మందితో కూడిన వైద్యుల బృందంలోని సభ్యుడు డాక్టర్ శుశ్రుత్ బెనర్జీ శుక్రవారం చెప్పారు.
కార్డియాక్, రీనల్ పంక్షన్స్ మెరుగు కాలేదని, దాంతోనే హీమో డయాలసిస్ నిర్వహించామని ఆయన చెప్పారు. జనవరి 1వ తేదీన ఎఎంఆర్ఐ ఆస్పత్రిలో చేరిన బసుకు ఆరోగ్యం సహకరిస్తే శుక్రవారం కూడా హీమో డయాలసిస్ చేస్తారు. రక్తంపోటును స్థిరపరచడానికి ఇప్పటికే లోనోట్రోప్ప్ డోసు పెంచారు. మళ్లీ ఉదయం 11 గంటలకు బసు ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తారు.