నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈనెల 23న భారీ బహిరంగసభ జరుగనుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించేందుకు ఈనెల 23న నర్సంపేటలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ అంబటి శ్రీనివాస్ తెలిపారు. సభకు ముందు తెలంగాణ ధూం.. ధాం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. బహిరంగ సభకు ప్రొఫెసర్ కోదండరాం, బుర్ర రాములు, విమలక్క హాజరవుతున్నారని, తెలంగాణ అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో జరిగిన రిలే దీక్షలో ముదిరాజ్ సంఘం బాధ్యులు బోయిని నర్సయ్య, పొలబోయిన కట్టయ్య, ముల్కల సాంబయ్యతోపాటు పలువురు కూర్చున్నారు.
అనంతరం దీక్షలనుద్దేశించి జేఏసీ నాయకులు శ్రీనివాస్, సాంబరాతి మల్లేశం, గుంటి రాంచందర్, జగదీశ్వర్ ప్రసంగించారు. తేజావత్ వాసునాయక్, కొమ్ము రమేష్‌యాదవ్, రాజు, సర్దార్, లకయ్య, జనగాం కుమారస్వామి పాల్గొన్నారు. ఇటుకాలపెల్లిలో జేఏసీ కన్వీనర్ జమాండ్ల చంద్రమౌళి ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేసి, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది రహీమొద్దీన్, సర్పంచ్ బానోతు కిషన్, ఎంపీటీసీ సభ్యుడు భూక్య వీరన్న, ఆరెల్లి వేణు, చిగురు సాంబయ్య, సంపత్, స్వామి, చంద్రయ్య, అజయ్‌బాబు, రమేష్, పుల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి