వరంగల్: ప్రజాప్రతినిధుల రాజీనామాలతో రాజ్యాంగ సంక్షోభం సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే వాదనను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య వ్యతిరేకించారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించి రాష్ట్రపతి పాలనను ఆహ్వానిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ శాశ్వతంగా మరుగున పడుతుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజీనామాలతో తెలంగాణ ప్రక్రియ వేగవంతమవుతుందని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ప్రజలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. నక్సలైట్ల పేరు చెప్పి తెలంగాణను అడ్డుకోవాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.
రాజీనామాలు చేసి వాటిని ఆమోదింపజేసుకుని రాజ్యాంగ సంక్షోభం సృష్టించి తెలంగాణను సాధించుకోవాలనే వాదన తెలుగుదేశం నాయకుల నుంచి బలంగా వినిపిస్తోంది. ఎమ్మార్పీయస్ వంటి ప్రజా సంఘాల నుంచి కూడా ఈ వాదన వినిపిస్తోంది. అయితే కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామాల విషయంలో వెనకాడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రోశయ్యను మార్చడానికి అది పనికి వస్తుందే తప్ప తెలంగాణ రాష్ట్ర సాధనకు పనికి రాదని వారు వాదిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి