వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనువిందు చేసిన సుదీర్ఘ సూర్యగ్రహణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Solar Eclipse
న్యూఢిల్లీ: ఈ శతాబ్దిలోనే సుదీర్షమైన సూర్యగ్రహణం ప్రజలకు శుక్రవారం కనువిందు చేసింది. కళ్లకు తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకుని ప్రజలు సూర్యగ్రహణాన్ని ఉత్సుకతతో వీక్షించారు. తమిళనాడులోని రామేశ్వరం, కేరళలోని ధనుష్కోటి, తిరువనంతపురంల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. సూర్యగ్రహణంపై పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు, విద్యార్థులు పెద్ద యెత్తున రామేశ్వరం చేరుకున్నారు. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం శుక్రవారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల వరకు కొనసాగింది. ధనుష్కోటి, కన్యాకుమారి, వర్కాలల్లో సూర్యగ్రహణం వలయాకారంలో దర్శనమిచ్చింది.

ఢిల్లీలో ఉదయం 11 గంటల 53 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. నెహ్రూ ప్లానిటోరియం నుంచి సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, సూర్యగ్రహణం ప్రభావాన్ని తెలుసుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉపరితలంలోకి రాకెట్లను ప్రయోగించింది. సూర్యగ్రహనానికి ముందు, తర్వాత వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకోవడానికి ఇస్రో ఈ రాకెట్లను ప్రయోగించింది. సూర్యగ్రహణం సమయంలో హరిద్వార్ లోని కుంభమేళా ఆగిపోయింది.

హైదరాబాదులో సూర్యగ్రహణం పాక్షికంగా కనిపించింది. సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు హైదరాబాదులోని బిర్లా ప్లానిటోరియానికి పెద్ద యెత్తున ప్రజలు చేరుకున్నారు. చిన్నారులతో సహా ఎంతో మంది ఆసక్తిగా సూర్యగ్రహణాన్ని వీక్షించారు. హైదరాబాదులో మబ్బులు అలుముకున్నాయి. అయితే తర్వాత అవి తొలగిపోవడంతో సూర్యగ్రహానాన్ని వీక్షించేందుకు వీలు కలిగింది. హైదరాబాదులోని 77 శాతం మాత్రమే దర్సనమిచ్చింది. కాళహస్తీశ్వర ఆలయం తప్ప రాష్టంలోని అన్ని ఆలయాలను సూర్యగ్రహణం సందర్బంగా మూసేశారు. గ్రహణం వీడగానే విజయవాడలోని కృష్ణానదిలో ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. గోదావరి నిదిలోనూ ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించారు. గ్రహణం వల్ల ఏ విధమైన అరిష్టాలు ఉండవని వాదిస్తూ జన విజ్ఞాన వేదిక హైదరాబాదులోని ట్యాంకుబండుపై సామూహిక భోజనాలు ఏర్పాటు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X