కరీంనగర్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా కథ తనదేనంటూ రామిరెడ్డి అనే డిగ్రీ విద్యార్థి కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ కథకు సంబంధించి తనకు గుర్తింపు ఇచ్చే వరకు పోరాటం సాగిస్తానని అతను అంటున్నాడు. పోలీసులు రామిరెడ్డి ఫిర్యాదును స్వీకరించి విచారణ ప్రారంభించారు. విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులంటున్నారు.
అదుర్స్ కథ తనదేనని, తాను జూనియర్ ఎన్టీఆర్ కు ఆ కథను ఇచ్చానని సినిమా విడుదలకు ముందు నుంచి రామిరెడ్డి మొత్తుకుంటున్నాడు. తనకు డబ్బులు అక్కర్లేదని, గుర్తింపు ఇస్తే చాలునని కూడా అంటున్నాడు. అయితే అదుర్స్ సినిమా ప్రదర్శన బహిష్కరణ గొడవలో రామిరెడ్డి గొంతు బయటి ప్రపంచానికి పెద్గగా వినిపించలేదు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి