హైదరాబాద్: తన వీర్ చిత్ర ప్రమోషన్ కోసం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శనివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా ఆయన ఐమాక్స్ థియేటర్ లో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. స్టెయిర్ కేస్ వద్ద అద్దాలు పగిలిపోయాయి.
హైదరాబాద్ ఐ మాక్స్ థియేటర్ లో ఆయన సందడి సృష్టించాడు. వీర్ చిత్రం సినీ ప్రపంచంలో కొత్త ట్రండ్ కు నాంది పలుకుతుందని ఆయన అన్నారు. వీర్ చిత్రం తెలుగు వెర్షన్ లో కూడా విడుదల కానుంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి