వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెచ్చిపోం, కానీ సహించం: దామోదర్ రెడ్డి

తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రాంతమూ ప్రజలూ ముఖ్యమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధించి తీరుతామని ఆయన ప్రకటించారు. జెఎసి నిర్ణయాలకు కట్టుబడి తాము ఉద్యమంలో పని చేస్తామని ఆయన చెప్పారు. గత యాభై ఏళ్లుగా అసమానతలు కొనసాగుతున్నా సహించామని, ఇక సహించబోమని ఆయన అన్నారు. తాము ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిస్తామని ఆయన చెప్పారు. విద్యార్థులు బలిదానాలు చేయకూడదనే ఉద్దేశంతో తాము ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. జెండాలను, పార్టీలను పక్కన పెట్టి ప్రత్యేక తెలంగాణే ఎజెండాగా తాము ఉద్యమిస్తున్నామని ఆయన చెప్పారు.