మూడో రోజుకు చేరిన జెఎసి దీక్షలు

Telengana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనను డిమాండ్ చేస్తూ ప్రారంభించిన తెలంగాణ జెఎసి నేతల రిలే నిరాహార దీక్షలు సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. జెఎసి కన్వీర్ కోదండరామ్ తో సహా పలువురు ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జెఎసి నేతలు శనివారం ఈ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణ వస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. సింగరేణి తాడిచర్ల కాంట్రాక్టుపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ స్థలాన్ని యాజమాన్యానికే అప్పగించాలని ఆయన కోరారు. తెలంగాణలో దళితుల వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు కోనేరు రంగారావు కమిటీ తేల్చిందని బిజెపి సీనియర్ విద్యాసాగర్ అన్నారు. తెలంగాణ వస్తేనే ఆ భూములను రక్షించుకోగలుగుతామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+