దేవశయని ఏకాదశి నుండి ఈ రాశులవారి దశ మారుతుంది.. సంపదల పండుగ మొదలవుతుంది

దేవశయని ఏకాదశి.. ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. దేవశయని ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమిస్తాడు. నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి నిద్రిస్తాడు. ఈ సమయాన్ని చాతుర్మాసం గానూ, చాలా పుణ్యకాలంగానూ చెబుతారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం లోని శుక్లపక్ష ఏకాదశి రోజున దేవశయని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు.

జూలై 25వ తేదీన దేవశయని ఏకాదశి

సనాతన ధర్మంలో దీనికి ఉండే విశేషం అంతా ఇంతా కాదు. దృక్ పంచాంగం ప్రకారం 2026 సంవత్సరంలో దేవశయని ఏకాదశి జూలై 25వ తేదీన వస్తుంది ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు నుండి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Devashayani Ekadashi The fortunes of these zodiac signs will change from Devashayani Ekadashi

మేష రాశి

మేష రాశి జాతకులకు జూలై 25వ తేదీ నుండి అదృష్టం కలిసి రాబోతుంది. వీరికి దేవశయని ఏకాదశి శుభాలను తీసుకువస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో వీరికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మేష రాశి వారు పెట్టిన పెట్టుబడుల నుండి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. వృత్తిలోను పురోగతికి అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం మరియు అవగాహన పెరిగే అవకాశం ఉంది.

వృషభరాశి

జులై 25వ తేదీ నుండి వృషభ రాశి వారికి వృత్తి విజయాలు అందుతాయి. పనిలో కష్టపడే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఆర్దిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది వృషభ రాశి జాతకులకు శుభ కాలం

కన్యారాశి

దేవశయని ఏకాదశి కారణంగా కన్యారాశి జాతకులకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. కన్యా రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయ వ్యయాల సమతుల్యత పెరుగుతుంది. వృత్తిలో పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి .స్నేహితులు, సన్నిహితుల నుండి ఈ సమయంలో పూర్తి మద్దతు లభిస్తుంది.

తులారాశి

దేవశయని ఏకాదశి తులా రాశి జాతకులకు విజయాలను, పురోగతిని సూచిస్తుంది. కష్టపడి పనిచేసే వారికి తగిన ప్రతిఫలం వస్తుంది. వీరు జీవితంలో సానుకూల ఫలితాలను చూస్తారు. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి. వైవాహిక జీవితం వీరికి సంతోషాన్నిస్తుంది. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+