త్వరలో ఆషాఢ పూర్ణిమ.. నక్కతోక తొక్కే రాశులు ఇవే!
ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి అంటారు. దీనినే గురు పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమికి హిందూ మత విశ్వాసాల ప్రకారం చాలా ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత పవిత్రమైన ఈ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జూలై 29వ తేదీన బుధవారం నాడు గురు పౌర్ణమి వచ్చింది.
ఆషాఢ గురు పౌర్ణమి
ఈ గురు పౌర్ణమి నాడు చంద్రుడు మకర రాశిలో సంచారం చేస్తాడు. ఇదే సమయంలో లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుని పూజిస్తారు. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆయా రాశుల వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి జాతకులకు ఆషాడ పూర్ణిమ అదృష్టాన్ని ఇస్తుంది. ఆషాడ పూర్ణిమ వేళ మేషరాశి వారిలో ఉత్సాహం ధైర్యం పెరుగుతాయి. పనిలో ప్రశంసలు లభిస్తాయి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మేష రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
మిధున రాశి
ఆషాడ పూర్ణిమ వేళ మిధున రాశి జాతకులు ఉత్సాహంగా గడిపే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ మాట తీరు చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఉద్యోగం చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఊహించిన ఆర్థిక లాభాలు వస్తాయి.
సింహరాశి
సింహరాశి జాతకులకు గురుపౌర్ణమి వేళ శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహ రాశి జాతకుల మనోధైర్యం పెరుగుతుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఆషాడ పూర్ణిమ అనుకూలతలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించే అవకాశం ఉంటుంది. మీన రాశి వారు ఈ సమయంలో ప్రత్యర్థుల పైన విజయం సాధిస్తారు. మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications