స్పష్టత లేకనే ఆత్మహత్యలు: కోదండరామ్

తెలంగాణ ఏర్పాటే విద్యార్థుల ఆత్మహత్యలకు పరిష్కారమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ మంగళవారం అన్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి వెంటనే తెలంగాణకు కాలపరిమితితో కూడిన కార్యాచరణనను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. వేణుగోపాల్ రెడ్డి తల్లిదండ్రులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరుకుని బోరుబోరున విలపిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కన్నీటి సంద్రమైంది. కేంద్ర ప్రభుత్వం, రాజీనామాలు చేయని తెలంగాణ ప్రజాప్రతినిధులపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications