మొయినాబాద్ లో తెలంగాణపై మాక్ పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా 90 శాతం మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నారని టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం వెంకట్‌రెడ్డి అన్నారు. మాక్ ఓటింగ్ నిర్వహించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తమ బతుకులు మారవనే అభిప్రాయం ప్రజల్లో నాటుకు పోయిందన్నారు. సాగునీరు, ఉద్యోగాలు, స్వయంపాలన దక్కాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయకుండా రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications