రాజీనామాలు చేయాల్సిందే: మధు యాష్కీ

Madhu Yashki
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ విద్యార్థుల ప్రాణాల ముందు రాజీనామాలు పెద్ద విషయం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికి వెనకాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజినామాలు చేస్తే మళ్లీ తెలంగాణ ప్రజలు వారినే గెలిపిస్తారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం కోస్తాంధ్ర నాయకులు కలిసికట్టుగా ఉండి ముద్దులు కూడా పెట్టుకున్నప్పుడు తెలంగాణ నాయకులు తలో మాట మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులు మరింత కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం తాము ఈ నెల 20వ తేదీన గానీ 21వ తేదీన గానీ ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్దిష్ట కాలపరిమితితో కూడా స్పష్టమైన ప్రకటన వెలువరించాలని తాము కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు. ఈ నెల 28వ తేదీలోగా కేంద్రం నుంచి ప్రకటన చేయాలని, లేకుంటే రాజీనామాల ఆమోదానికి పట్టుబట్టాలని జెఎసి తీసుకున్న నిర్ణయానికి ప్రజాప్రతినిధులంతా కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+