షిర్డీ వెళ్లే భక్తులకు IRCTC బంపర్ ఆఫర్ - ఇక నుంచి ప్రతీ వారం..!!
షిర్డీ వెళ్లే సాయిబాబా భక్తులకు IRCTC బిగ్ అప్డేట్ ఇచ్చింది. ప్రతీ వారం హైదరాబాద్ నుంచి షిర్డీకి ప్రత్యేకంగా రైలు ఏర్పాటు చేసారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ నుంచి షిర్డీ యాత్రకు వీలుగా స్పెషల్ ప్యాకేజీని ఐఆర్సీసీటీ ప్రకటించింది. ప్రతీ బుధవారం కాచిగూడ నుంచి ఈ రైలు షిర్డీకి బయల్దేరుతుంది. వివిధ కేటగిరీల్లో అమలు కానున్న ప్యాకేజీ ధరలను అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లే సాయిబాబా భక్తుల కోసం తక్కువ బడ్జెట్ లో మూడు రోజుల యాత్ర ను ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీకి సాయి సన్నిధిగా పేరు ఖరారు చేసిన అధికారులు.. ప్రతీ బుధవారం కాచిగూడ నుంచి ఈ రైలు బయల్దేరుతుందని వెల్లడించారు. ఈ రైలులో థర్డ్ ఏసీతో పాటుగా స్లీపర్ క్లాస్ అందుబాటులో ఉంటుంది. అయితే, ప్యాకేజీలో భాగంగా
కంఫర్ట్ 3 ఏసీ : సింగిల్ : రూ.7920, డబల్ రూ.6700, త్రిబుల్ రూ.6690, 5-11ఏళ్ల పిల్లలకు రూ.6080, 5-11ఏళ్ల పిల్లలకు వితౌట్ బెడ్ రూ.5050గా నిర్ణయించారు. అదే విధంగా స్లీపర్ (SL) : సింగిల్ రూ.6370, డబల్ రూ.5100, త్రిబుల్ రూ.5100, 5-11ఏళ్ల పిల్లలకు రూ.4390, 5-11ఏళ్ల పిల్లలకు వితౌట్ బెడ్ రూ.3360 గా అధికారులు వివరించారు.

షిర్డీకి మూడు రోజుల సందర్శన ప్యాకేజ్
బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు అజంతా ఎక్స్ ప్రెస్ బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరిన తరువాత అక్కడి ఐఆర్సీటీసీ సిబ్బంది వీరిని పికప్ చేసుకొని షిర్డీలో హోటల్ కు తీసుకెళ్తారు. అక్కడ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవాలి. సాయంత్రం 5 గంటలకు బయల్దేరి రాత్రి 8.30గంటలకు ట్రైన్ నంబర్ 17063 బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు కాచిగూడ తిరిగి చేరుకుంటుంది. పూర్తి వివరాలకు సికింద్రాబాద్లోని IRCTC సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయంలో.. 040 27702407, 9701360701 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.


Click it and Unblock the Notifications