లాస్ ఏంజెలిస్: భారత సంగీత యోధుడు ఏఆర్ రెహమాన్ మరోమారు ఆస్కార్ పోరుబరిలోకి దిగారు. తన తొలి హాలీవుడ్ చిత్రం 'కపుల్స్ రిట్రీట్' సినిమా కోసం స్వరపరిచిన 'నా నా' అనే తమిళ పాట ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. రెహమాన్ ఆరేళ్ల కుమారుడు అలీమ్ ఈ పాటకు తన స్వరాన్ని అందించాడు.
ఈ పాటను రెహమాన్ స్వయంగా రచించారు. అలీమ్ తోపాటు క్లింటన్, డొమినిక్ అనే ముగ్గురు కలిసి పాడారు. 'ఉత్తమ గీతం' (బెస్ట్ ఒరిజనల్ సాంగ్) కేటగిరీకి ఈ పాట నామినేట్ అయింది. మరో 62పాటలతో పోటీపడనుంది. విజేతలను వచ్చేనెల 2న ప్రకటిస్తారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి