నల్గొండ: ఎంసిఎ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి మృతదేహం సూర్యాపేట సమీపంలోని అతని స్వగ్రామం దోసపహాడ్‌కు చేరుకుంది. గ్రామస్తులు కన్నీటి నివాళులర్పించారు. అంతకు ముందు మృత దేహం సూర్యాపేటకు చేరుకున్న సమయంలో వందలాది మంది ప్రజలు వేణుగోపాల్ రెడ్డికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం వేణుగోపాల్ రెడ్డి ఉస్మానియా వర్సిటీ ప్రాంగణంలో నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
అంతకు ముందు వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని గన్ పార్క్ కు తీసుకెళ్ళడానికి విద్యార్ధులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాళ్ళు రువ్విన విద్యార్ధులపై లాఠీ చార్జి చేశారు. ఈ సంఘటనలో 12మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను గాంధీ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రులకు తరలించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి