జూ ఎన్టీఆర్ పెళ్ళి వార్తతో గుంటూరు జిల్లాలో సంబరాలు

టీడీసీ అధినేత చంద్రబాబుకు లక్ష్మీప్రణతి తల్లి మేనకోడలు. ఈ వివాహంతో అటు నందమూరి కుటుంబంతోపాటు ఇటు చంద్రబాబుకు కూడా జిల్లాతో బంధుత్వం ఏర్పడబోతోంది. నార్నె శ్రీనివాసరావు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. 1999లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున అసెంబ్లీ సీటుకోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒక దశలో ఆయనకు సీటు ఖరారైందని కూడా ప్రచారం జరిగింది. చంద్రబాబుకు బంధువు కావడంతో సీటు ఖాయమని భావించారు. అయితే చివరి క్షణంలో ఆ సీటును ప్రత్తిపాటి పుల్లారావుకు కేటాయించారు. ఆ తర్వాత ఆయన పెద్దగా జిల్లా రాజకీయాల్లో పాల్గొనలేదు.
నార్నె శ్రీనివాసరావు తండ్రి అప్పారావు మొదటి నుంచి వ్యాపార రంగంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 1965లో ఆయన మకాం హైదరాబాద్‌కు మార్చారు. ఇదిలా ఉంటే చిలకలూరిపేటలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరులోని సాయిబాబారోడ్డులో 2001-02లో నార్నె టవర్స్‌ను నిర్మించారు.
బిల్డర్‌గా రాణించాలని భావించినప్పటికీ అనంతర పరిణామాల నేపథ్యంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. అయితే శుభ కార్యాలు, వివిధ కార్యక్రమాలకు శ్రీనివాసరావు వింజనంపాడు వస్తుండేవారు. నార్నె శ్రీనివాసరావు ప్రస్తుతం స్టూడియో-ఎన్ టీవీ చానల్‌ను నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. లక్ష్మీప్రణతి పెద్దకుమార్తె కాగా, కుమారుడు చిన్నవాడు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతోంది.












Click it and Unblock the Notifications
