వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రిలో శిశువు మాయం కేసు: స్వీపరే దొంగ

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: సంచలనం సృష్టించిన శిశువు మాయం కేసులో అసలు దొంగ ప్రభుత్వాస్పత్రి స్వీపరేనని తేలింది. డబ్బుకు కక్కుర్తిపడిన స్వీపర్‌ తల్లి పొత్తిళ్ల నుంచి పసికందును దొంగిలించి అమ్మేసింది. శిశువు మాయమైన సమయంలో డ్యూటీలో ఉన్న ప్రభుత్వాస్పత్రి సిబ్బందినందరినీ గట్టిగా విచారణ జరపగా స్వీపర్‌ లకి నిజాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు శిశువును కొనుగోలు చేసిన వారి చిరునామతెలుసుకుని అక్కడికెళ్లి బిడ్డను తీసుకొచ్చారు. తల్లి ఒడికి బిడ్డను చేర్చారు. నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపిన ఈ కేసు వివరాలను డీసీపీ విజయ్‌కుమార్‌ గురువారం సాయంత్రం కమిషనరేట్‌లో విలేకరులకు వివరించారు.

ఆయన కథనం ప్రకారం చందర్లపాడు మండలం పొక్కునూరుకు చెందిన కొండ్రు సునీత గత నెల 26వ తేదీ పాతప్రభుత్వాస్పత్రిలో మృత మగ శిశువును ప్రసవిం చింది. దీంతో సునీత, ఆమె తల్లి వెంకాయమ్మ ఆస్పత్రిలో పరిచయమైన స్వీపర్‌ మజ్జి లక్ష్మితో తమ ఇబ్బందిని చెప్పుకున్నారు. తమకు ఒక పాప ఉందనీ, మగ పిల్లాడు కావాలనీ, ఎవరైనా అమ్మితే కొంటామని చెప్పి తమ ఊరు వెళ్లిపోయారు. ఈ నెల 23వ తేదీ వారు మళ్లీ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా లక్ష్మిని కలిసి మళ్లీ మగబిడ్డ గురించి అడిగారు. దీంతో లకిని ఆ రాత్రికి అక్కడే ఉండమని చెప్పింది. ఆ రాత్రి ప్రసూతి వార్డులో కంకిపాడుకు చెందిన చల్లా ఏసమ్మ నిద్రిస్తుండగా ఆమె బిడ్డను దొంగిలించింది.

ఆ శిశువును అక్కడే ఉన్న సునీత, వెంకాయమ్మకు ఇచ్చి రూ.5 వేలు తీసుకుంది. బిడ్డను వారు ఆస్పత్రి నుంచి బయటకు తీసుకెళ్లడానికి సెక్యూరిటీ గార్డు కోడూరు పిచ్చయ్య సహకరించాడు. ఆ తర్వాత వారు శిశువును పొక్కునూరుకు తీసుకెళ్లిపోయారు. తన బిడ్డ మాయమవ్వడంపై ఏసమ్మ ఆమె భర్త గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన పోలీసులు బిడ్డ మాయమైన సమయంలో విధుల్లో ఉన్న అందరినీ విచారించారు.

లక్ష్మిపై అనుమానంతో సోదా చేయడంతో ఏసమ్మ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆస్పత్రిలో ఇచ్చిన కూపన్‌ ఆమె వద్ద దొరికింది. దీంతో ఆమె నిజాన్ని ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో గురువారం పొక్కునూరు వెళ్లి వెంకాయమ్మ, సునీత వద్ద నుంచి బిడ్డను తీసుకొచ్చారు. ఆ తర్వాత బిడ్డను ఏసమ్మకు అప్పగించారు. లకితోపాటు ఆమెకు సహకరించిన సెక్యూరిటీ గార్డు పిచ్చయ్య, బిడ్డను కొన్న వెంకాయమ్మ, సునీతలను అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో డీసీపీతో వెస్ట్‌జోన్‌ ఏసీపీ ప్రకాశరావు, గవర్నర్‌పేట సీఐ ప్రసాద్‌, ఎస్సై అన్నే సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X