వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శిలాఫలకాలపై లేవి పేరు: మంత్రి పనబాక కినుక

ఈ విగ్రహాల శిలాఫలకాలపై జిల్లాలోని మంత్రులు, ఇతర ముఖ్య నేతల పేర్లు ఉన్నాయి. కేంద్రమంత్రిగా తనపేరు లేదని పనబాక లక్ష్మి కినుక వహించారు. అదేవిధంగా తెనాలి పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన పైలాన్‌పై కూడా మంత్రి పనబాక పేరు లేదని అనుచరులు ఆమె దృష్టికి తెచ్చారు.
దీంతో ప్రొటోకాల్ నిబంధనలపై ఆమె ఆరా తీశారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు లోక్‌సభ పరిధిలో ఉంది. అందువలన పనబాక లక్ష్మి పేరు శిలాఫలకాలపై వేయలేదని స్థానిక అధికారులు వివరణ ఇచ్చారు. కేంద్రమంత్రిగా జిల్లాలో ప్రొటోకాల్ నిబంధనలు మంత్రి పనబాకకు వర్తిస్తాయని అనుచరులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో మంత్రి పనబాక అనుచరులు గురువారం రాత్రి తెనాలిలో తమ నేత పేరు శిలాఫలకాలపై వేయలేదని గుంటూరులోని ప్రొటోకాల్ అధికారుల దృష్టికి తెచ్చారు.