పడవ బోల్తా: పద మంది మృతి, 23 మంది గల్లంతు

West Godavari
నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద గోదావరి నది ఉప్పుటేరులో నాటుపడవ బోల్తా పడి పది మంది మృతి చెందగా, 23 మంది గల్లంతయ్యారు. శనివారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్ర స్నానానికి వెళ్తుండగా పడవ బోల్తా పడింది. పౌర్ణమి కావడంతో వారు సముద్ర స్నానానికి బయలు దేరారు.

పడవలో 40 మందికి పైగా ప్రయాణికులున్నట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 9 గంటల వరకు పది మృతదేహాలను వెలికి తీశారు. అంతర్వేదిలో పాలెం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు జరుగుతాయి. శనివారం ఉత్సవాల చివరి రోజు కావడంతో సముద్రస్నానానికి వారు అంతర్వేదికి బయలుదేరారు. అంతర్వేది సముద్రంలో గోదావరి నది సంగమించే చోటు. దీంతో సముద్రం ఆటపోట్ల ప్రభావం అక్కడ తీవ్రంగా ఉంటుంది.

పడవ ప్రమాదంలో 25 నుంచి 30 మంది దాకా గల్లంతయినట్లు ప్రాథమిక సమాచారమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్ చెప్పారు. సహాయక చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఎదురుగా వస్తున్న ఖాళీ పడవ ప్రయాణికులతో వెళ్తున్న పడవ తాకడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోందని ఆమె చెప్పారు. కాగా, పడవలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+