బిసి నేత కారుపై దాడి: హత్య, కిడ్నాప్

vijayawada
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో శనివారం ఉదయం బిసి నేత పలగాని ప్రభాకర్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వారు కారుపై దాడి చేసి డ్రైవర్ ను హత్య చేశారు. కారులో ఉన్న ప్రభాకర్ కూతురును కిడ్నాప్ చేశారు. ప్రభాకర్ కుమారుడు మాత్రం వారి నుంచి తప్పించుకున్నాడు. విజయవాడలోని మధురానగర్ ప్రాంతంలోని సాయిబాబ గుడి వద్ద ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. దీంతో విజయవాడలో తీవ్ర సంచలనం చెలరేగింది.

సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - కారు అద్దాలు పగిలినట్లు శబ్దం రావడంతో డ్రైవర్ కారును ఆపాడు. రెండు బైకులపై వచ్చిన కుర్రాళ్లు కారుపై దాడి చేసి డ్రైవర్ ను కత్తితో పొడిచి కింద పడేశారు. ఈ సమయంలో ప్రభాకర్ కుమారుడు కారు దిగి తప్పించుకున్నాడు. బాలికను తీసుకుని దుండగులు అదే కారులో పారిపోయారు. ప్రభాకర్ కు చెందిన ఎపి 03/ఆర్2333 అనే నెంబర్ కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటనా స్థలంలో కత్తి పడి ఉంది.

వ్యాపార లావాదేవీల వల్ల ఈ సంఘటన జరిగిందా, డబ్బుల కోసమే ఈ కిడ్నాప్ జరిగిందా అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. తనకు శత్రువులు ఎవరూ లేరని, ఎవరి మీద కూడా తనకు అనుమానం లేదని పలగాని ప్రభాకర్ అంటున్నారు. ఎందుకు ఈ సంఘటన జరిగిందో తెలియడం లేదని ఆయన చెబుతున్నారు. నిందితులను కొద్ది సేపట్లో గుర్తించగలమని పోలీసులు అంటున్నారు. ప్రతి రోజు తన ఇద్దరు పిల్లలను డ్రైవర్ పాఠశాలకు తీసుకెళ్తాడని, అదే విధంగా ఈ రోజు కూడా వెళ్లాడని ఆయన చెప్పారు. ముగ్గురు దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాలికను తీసుకుని వెళ్లిన దుండగులు కొద్ది సేపట్లోనే కారులో విజయవాడ దాటినట్లు అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఈ బాలికను కిడ్నాప్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+