విజయవాడ: బిసీ నాయకుడు పలగాని ప్రభాకర్ కూతురు కిడ్నాప్ వ్యవహారం మిస్టరీగా మారింది. బీసి నేత ప్రభాకర్ కారు గుంటూరు జిల్లా కుంచనపల్లి వద్ద కనిపించింది. కారు డ్రైవర్ ను హత్య చేసి ప్రభాకర్ కూతురు వైష్ణవిని దుండగులు కిడ్నాప్ చేసుకుని అదే కారులో వెళ్లారు. ఆ కారును కుంచనపల్లి వద్ద దుండగులు విడిచి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ కూతురు వైష్ణవి నాలుగో తరగతి చదువుతోంది. గతంలో కూడా దుండగులు వైష్ణవిని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకుని వదిలి పెట్టారు. డబ్బుల కోసమే వైష్ణవిని కిడ్నాప్ చేశారా, మరేమైన కారణముందా అనే విషయం తెలియడం లేదు. ప్రభాకర్ రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారాలున్నాయి. ఈ వ్యాపార లావాదేవీలు కిడ్నాప్ నకు కారణమని భావిస్తున్నారు.
డ్రైవర్ లక్ష్మణరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రభాకర్ కుమారుడు కారు దిగి దుండగుల నుంచి తప్పించుకున్నాడు. తనకు శత్రువులు ఎవరూ లేరని ప్రభాకర్ చెబుతున్నారు. అయితే, ప్రభాకర్ ను హత్య చేయడానికే దుండగులు ప్రయత్నించారు. అయితే, కారులో ప్రభాకర్ లేకపోవడంతో ఆయన కూతురును కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ను పోలీసులు రంగంలోకి దింపారు. శునకాలు ఏలూరు రోడ్డు దాకా వచ్చి ఆగిపోయాయి. దుండగులు తాడేపల్లికి వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు గాలిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి