మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా: రఘువీరా

ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన తెలిపారు. ముగ్గురు గల్లంతైనట్లు వారి బంధువులు చెబుతున్నారని ఆయన అన్నారు. 25 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని, వారిలో ఆరుగురిని ఆస్పత్రికి తరలించారని ఆయన వివరించారు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, విశాఖ నుంచి హెలికాప్టర్లను సంఘటనా స్థలానికి పంపించామని ఆయన వివరించారు. హెలికాప్టర్, రెండు లైట్ బోట్లు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ప్రమాద స్థలికి ఆయన బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications
