పడవ బోల్తా: రోశయ్య విచారం

జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి మృతుల కుటుంబాలను ఆదుకుంటామని జిల్లా ఇంచార్జీ మంత్రి రఘువీరా రెడ్డి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మరో మంత్రి పితాని సత్యనారాయణ హామీ ఇచ్చారు. పడవ ప్రమాదంపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, మృతుల సంఖ్య 12కు చేరినట్లు సమాచారం. స్థానికులు 40 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పుటేరులో పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. మృతులు మొగల్తూరు, దర్నరేవు, బియ్యపుతిప్పలకు చెందినవారని తెలుస్తోంది. మృతులకు రాష్ట్ర మంత్రివర్గం కూడా సంతాపం ప్రకటించింది.












Click it and Unblock the Notifications
