ఈ వారంలోనే తెలంగాణ కమిటీ: చిదంబరం

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణపై ఈ వారంలోనే కమిటీ వేస్తామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. గతంలో చెప్పిన విషయానికి తాము కట్టుబడి ఉన్నామని, దానికి ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై వేసే కమిటీకి ఇంకా రూపకల్పన జరగలేదని, విధివిధానాలు ఖరారు కాలేదని, ఖరారు కాగానే వెల్లడిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కమిటీ, యంత్రాంగం ఒక్కటేనని, వేర్వేరు కావని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి వచ్చిన డిమాండ్లపైనే కమిటీ చర్చిస్తుందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణపై అన్ని వర్గాలను సంప్రదించడానికే కమిటీ వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కమిటీ లేదా యంత్రాంగం కోసం వేచి చూడాలని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలించిందని ఆయన చెప్పారు. తాము వేసే కమిటీ వివరాలు రహస్యంగా ఏమీ ఉండవని ఆయన మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిన్నపాటి ఆందోళనలు, నిరసనలు మినహా ఆంధ్రప్రదేశ్ లో భారీ హింసాత్మక సంఘటనలేవీ జరగలేదని, పరిస్థితి ప్రశాంతంగానే ఉందని ఆయన చెప్పారు. ఆత్మహత్యల వంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కోరారు. కమిటీ వేయడంలో ఆలస్యమేమీ జరగలేదని, జరగదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+