ఎపి విభజనకే కమిటీ వేయాలి: నాగం జనార్దన్ రెడ్డి

అందరూ కలిసి ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ జెఎసి నుంచి కాంగ్రెసు విడిపోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అరెస్టులతో తమ ఉద్యమం ఆగదని, తెలంగాణ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో తమకు నిరసనలు తెలిపే హక్కు కూడా లేదా అని ఆయన అడిగారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్, జెఎసి నేత కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు సోమవారం ఉద్యమం సాగింది.












Click it and Unblock the Notifications