కాంగ్రెసు జెఎసిలో ఉంటుంది: కోదండరామ్

ధర్నా కార్యక్రమాలు విజయవంతంగా సాగాయని, రేపు కూడా ఆందోళన కార్యక్రమాలు సాగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర మంత్రి చిదంబరం నుంచి స్పష్టమైన ప్రకటనను కోరుతున్నామని, కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ కోసం వేచి చూస్తున్నామని ఆయన చెప్పారు. కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలకు తావు లేకుండా సీమాంధ్ర నేతలు వ్యవహరించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications