మహబూబ్ నగర్: కేఏ పాల్ సోదరుడు కె.డేవిడ్ రాజుది సహజ మరణం కాదని, హత్యేనని జిల్లా ఎస్పీ సుధీర్ బాబు సోమవారం ఇక్కడ తెలిపారు. నాలుగు బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని, కేసు దర్యాప్తులో పురోగతి సాధించామని ఆయన తెలిపారు. ఈ రోజు సాయంత్రం డేవిడ్‌రాజు హత్యకేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. డేవిడ్‌రాజు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి వద్ద ఏడో నెంబర్ జాతీయరహదారి పక్కన అనుమానాస్పదంగా మృతి చెందిన డేవిడ్‌రాజు మృతదేహాన్ని పోలీసులు శనివారం రాత్రి కనుగొన్న విషయం తెలిసిందే.