కమిటీ తర్వాతే జెఎసిపై నిర్ణయం: జానా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. తాము సంయమనం పాటిస్తూ సామరస్య వాతావరణానికి సహకరిస్తున్నామని, అందుకు మిగతా పార్టీలు సహకరించాలని ఆయన అన్నారు. కేంద్రం కమిటీ వేసిన తర్వాత అది తెలంగాణకు అనుకూలమో కాదో చూసి మాట్లాడుతామని ఆయన చెప్పారు. తెలంగాణేతర ప్రాంతంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను గోబ్యాక్ అంటూ అవమానించడాన్ని ఆయన ఖండించారు. సీమాంధ్ర నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదని ఆయన కోరారు. తాము సంయమనంగా ఉన్నట్లే సీమాంధ్ర నేతలు కూడా ఉండాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications