సిఎం రోశయ్య విశాఖ పర్యటనకు కోటి మంజూరు

ఇందుకోసం డీఆర్ డీఏ 400 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోనుంది. ఒక్కో బస్సులో 60 మంది చొప్పున మహిళలను అచ్యుతాపురం బహిరంగ సభ వేదిక ప్రాంతానికి తీసుకొస్తారు. సభకు కనీసం 25వేల మంది మహిళలు హాజరయ్యేలా డీఆర్‌డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి విశాఖ వచ్చినప్పటికీ ఎక్కడా బహిరంగ సభల్లో పాల్గొనలేదు. ఈసారి డ్వాక్రా లింకేజి రుణాల పంపిణీ పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించడంతో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా రూ.కోటి మేర ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తంలో రూ.56 లక్షలు ఆర్టీసీ బస్సుల అద్దెల రూపేణా వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కొక్క బస్సుకు రూ. 14 వేల చొప్పున 400 బస్సులకు అద్దె చెల్లిం చాలి. డ్వాక్రా సదస్సులో షామియానాల ఏర్పాటుకు కూడా భారీగా వెచ్చించాల్సి ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆ ఖర్చు రూ.25 లక్షల వరకు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాటు, లింకేజి రుణాల పంపిణీకి ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నా నిధులెవరు సమకూరుస్తారో అంతుబట్టడం లేదు.












Click it and Unblock the Notifications