తెలంగాణ కమిటీకి సీమాంధ్ర నేతల వ్యతిరేకత

తమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అనంతపురంలో జరిగిన జెఎసి సమావేశంలో కాంగ్రెసు నాయకుడు శైలజానాథ్, తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ చెప్పారు. తెలంగాణపై ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం చిదంబరానికి లేదని ప్రజారాజ్యం పార్టీ నేత సి. రామచంద్రయ్య అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు కమిటీ వేస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. తెలంగాణపై కేంద్రం వేసే కమిటీని అంగీకరించబోమని తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. సమైక్యాంధ్ర కోసం మేధావులు గళం విప్పాలని కాంగ్రెసు నాయకుడు మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. కేంద్రం వేసే కమిటీతో అందరికీ న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు.












Click it and Unblock the Notifications