మొయిలీ ఆదేశాలపై కాంగ్రెసులో తలోమాట

జెఎసి అంటే ఏమిటో తనకు తెలియదని, మొయిలీ ప్రకటనను తాను ఇంకా చూడలేదని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవ రావు అన్నారు. తాను హైదరాబాదు వచ్చిన తర్వాత అందరితో మాట్లాడి జెఎసిలో ఉండే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మరో నేత అమోస్ అన్నారు. ప్రశాంత వాతావరణం కోసమే మొయిలీ ఆ ప్రకటన చేసి ఉంటారని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంత రావు అన్నారు. కెసిఆర్ చెప్తే జెఎసి పనిచేస్తోందని ఆయన విమర్శించారు. జెఎసిలో ఉన్న కాంగ్రెసు నాయకులే మొయిలీ ప్రకటనపై ఆలోచించాలని ఆయన అన్నారు. మొయిలీ మాటలు తెలంగాణ నాయకులకే కాకుండా సీమాంధ్ర కాంగ్రెసు నాయకులకు కూడా వర్తించాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు.












Click it and Unblock the Notifications