రాష్ట్రం ముక్కలైతే మరోపార్టీ పుడుతుంది: టిజివి

కర్నూలులో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆరేళ్లుగా ఐక్య వేదిక నెత్తీనోరు మొత్తుకుంటున్నా రాయలసీమ నాయకుల్లో కదలిక రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీమ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున అందరూ కలసి రావాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసిన వెంటనే తిరుపతిలో విద్యార్థులతో సదస్సు నిర్వహిస్తామని, అక్కడే రాయలసీమ హక్కుల కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications