ముస్లిం రిజర్వేషన్లను కొట్టేసిన హైకోర్టు

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా తాను అధికారంలోకి రాగానే ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. దీనిపై కొంత మంది హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు రిజర్వేషన్లను కొట్టేసింది. దాంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో ముస్లింల రిజర్వేషన్లను 4 శాతానికి తగ్గిస్తూ ఒబిసిల కింద రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని కూడా హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.












Click it and Unblock the Notifications