మంత్రాలయం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఈనెల 15 నుంచి 21 వరకు రాఘవేంద్రస్వామి 415వ జన్మదిన వేడుకలు, 389వ పట్టాభిషేక మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదివారం శ్రీమఠం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ, గృహ నిర్మాణాలశాఖ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, కర్ణాటక మంత్రులు ఆరవింద్‌లింబావళి, రామచంద్రగౌడ, ఆచార్యలతోపాటు కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, బెంగళూరు ఎమ్మెల్యే శోభ కరంద్లాజే, కర్ణాటక రాష్ట్ర బీజీపీ అధ్యక్షులు ఈశ్వరప్ప తదితరులు పాల్గొననున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుయతీంద్రతీర్థుల నేతృత్వంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.