• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శోభారాణి ఇంటిపై తెలంగాణ వాదుల దాడి

By Santaram
|

Sobha Rani
హైదరాబాద్‌: ప్రజారాజ్యం మహిళానేత శోభారాణి ఇంటిపై తెలంగాణ వాదులు దాడి చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ వాదులు ఎల్లరెడ్డిగూడలోని శోభారాణి ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై రాళ్లు రువ్విన ఆందోళనాకారులు ఇంటి ఆవరణలోని పూల కుండీలను పగులగొట్టి బీభత్సం చేశారు.

సమైక్యాంధ్రకు అనుకూలంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించినందుకు వ్యతిరేకంగా తన ఇంటిపై తెలంగాణ ప్రాంత విద్యార్థులు దాడి జరిపారని శోభారాణి ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేయాలని ఆందోళనాకారులు డిమాండ్‌ చేశారని అయితే అందుకు వ్యతిరేకించానని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X