కోదండరామ్ ప్రొఫెసర్ పోస్టు వదులుకోవాలి: ఎర్రంనాయుడు

Yerram Naidu
హైదరాబాద్: తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ మొదట తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేయాలని టిడీపి సీనియర్ నాయకుడు కింజరాపు ఎర్రంనాయుడు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను రాజీనామా చేయాల్సిందేనని ఉపన్యాసాలిస్తున్న ఆయన మొదట ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత మాట్లాడాలని ఎర్రన్నాయుడు అన్నారు.

ఇలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ, సమైక్యవాది లగడపాటి రాజగోపాల్ పై తెలంగాణ వాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై చర్య తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరతామని మంత్రి కోమటిరెడ్డి వెంటరెడ్డి అన్నారు. అనంతపురం సమైక్యాంధ్ర ఐకాస సభకు లగడపాటి హాజరు కాకుండా చూడాలని ముఖ్యమంత్రి రోశయ్యను కోమటిరెడ్డి కోరారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును త్వరగా చేయాలని సోనియాకు లేఖ రాయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+