పాట్నా: బీహార్ లోని జముయి జిల్లా ఫుల్‌వారియా గ్రామంలో మావోయిస్టులు జరిపిన దాడిలో 10మంది గ్రామస్తులు మృతిచెందారు. గత రాత్రి సాయుధులైన 150మంది మాబోయిస్టులు మూకుమ్మడిగా దాడిచేసి ఇళ్లకు నిప్పంటించారు. బాంబులు అమర్చి పేల్చి 7గురిని హతమార్చగా మరో ముగ్గురిని నేరుగా కాల్చిచంపారు.
ఆరుగురు గ్రామస్తులను బలవంతంగా తీసుకెళ్లారు. ఫిబ్రవరి 1న పోలీసులు 8మంది మావోయిస్టులను కాల్చిచంపారు. ఇందుకు సహకరించారంటూ ఈ గ్రామంపై మావోయిస్టులు దాడిచేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. వీరిని పోలీసు ఇనఫార్మర్ లుగా అనుమానించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి