చిత్తూరు: చిత్తూరు జిల్లా కార్వేటి నగర్ మండలం చిన్నకనుమపల్లి వద్ద ఈ రోజు ఉదయం పెళ్లి బృందంతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన పుత్తూరు వాసులు.
ఈ పెళ్ళి బృందం చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో రాత్రి జరిగిన పెళ్ళి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో 10 ఏళ్ళ బాలిక, మహిళ ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో స్ధానికులు పోలీసులకు సహకరిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి