తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజకీయాల్లో ఉండను: లగడపాటి
State
oi-Santaram
By Santaram
|
అనంతపురం: రాష్ట్ర విభజన అంటూ జరిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుంటానని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డితో రోశయ్య పాలనను పోల్చలేమన్నారు. రాష్ట్రం ముక్కలైతే వైఎస్ చెప్పినట్లు హైదరాబాద్‌కు వీసా తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని లగడపాటి వ్యాఖ్యానించారు.
సమైక్యాంధ్ర తరఫున రాజగోపాల్ నాయకత్వం వస్తున్నారు. అనంతపురంలో నేడు జరుగనున్న సమైక్యాంధ్ర సదస్సుకు హాజరు కావద్దని తెలంగాణ వాదులు రాజగోపాల్ ను హెచ్చరించారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రాజగోపాల్ మీద తెలంగాణ వాదులు దాడి చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి