గవర్నర్ ను కలిసిన లక్ష్మీపార్వతి, దిగ్బంధనంపై వినతి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన లేని శ్రీకృష్ణ కమిటీని రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఈనెల 20న చేపట్టనున్న 'అసెంబ్లీ ముట్టడి' ఎట్టి పరిస్థితుల్లో ఆగదని టీఎస్‌జాక్ నాయకులు బాల్క సుమన్, రాజేష్, కైలాష్‌నేత, రాజారాంయాదవ్, కిషోర్, జగన్ స్పష్టం చేశారు. బుధవారం వారు ఆర్ట్స్ కాలేజీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పెట్టి ఆమోదించేలా చూడాలని కోరారు. రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధుల సంగతి ప్రజలే తేలుస్తారని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా చేసిన వారిని తెలంగాణ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని జాక్ తరపున హామీ ఇస్తున్నట్లు విద్యార్థులు చెప్పారు. రాజీనామా చేసిన నాయకులకు వ్యతిరేకంగా ఏ పార్టీ అయినా, ఎవరైనా నామినేషన్ వేస్తే వారిని రాళ్లతో తరిమికొడతామని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, హిట్లర్ పాలన కొనసాగుతుందన్నారు.