జైపూర్: జైపూర్ వన్డేకు తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దాంతో స్టేడియం వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. జైపూర్‌కు వెళ్లే అన్ని రహదారుల్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ నెల 21న భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈనెల 19 లేదా 20 న ఉభయ దేశాల జట్లు ఇక్కడికి చేరుకోవచ్చు. వారు బసచేసే హోటళ్ళ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి