జూన్ 4 నుంచి వృషభం, కర్కాటకం, ధనుస్సు, సింహరాశివారికి తిరుగులేదు
జూన్ మాసంలో గ్రహాల గమనం విలక్షణమైన మార్పులకు లోనవుతోంది. ఈ క్రమంలోనే నెల ప్రారంభంలోనే జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనదిగా భావించే 'వైధృతి యోగం' ఏర్పడనుంది. జూన్ 4వ తేదీ సాయంత్రం 6.00 గంటల సమయంలో మనఃకారకుడైన చంద్రుడు, కీర్తి-గౌరవాలకు అధిపతి అయిన సూర్యుడి కలయికతో ఈ అరుదైన, బలమైన రాజయోగం సిద్ధించనుంది. వైధృతి యోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా, కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. దీనివల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి పెరగనున్న ఆత్మవిశ్వాసం
వైధృతి యోగ ప్రభావం వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైన కాలం ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న భయాలు, ఆందోళనలు పూర్తిగా నశించి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి, కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు బలపడతాయి. స్నేహితులతో చాలా రోజులుగా నడుస్తున్న విభేదాలు, మనస్పర్థలు ఈ సమయంలో పటాపంచలవుతాయి. పెళ్లికాని వృషభరాశి యువతీ యువకులకు ఈ కాలంలో వివాహ ఘడియలు దగ్గరపడతాయి. మీ ఆత్మవిశ్వాసం అంచలంచెలుగా పెరుగుతుంది.

కర్కాటక రాశి వారికి పెండింగ్ పనులు క్లియర్
సూర్య, చంద్రుల ప్రత్యేక అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల కలిసొస్తుంది. ఏ పని తలపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ఎన్నో ఏళ్లుగా, నెలలుగా నిలిచిపోయిన పనులు లేదా కోర్టు వ్యవహారాలు చాలా సులువుగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పదోన్నతి లేదా ప్రశంసలు దక్కుతాయి. కెరీర్‌లో ముందుకు వెళ్లడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో నయమవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.
సింహ రాశి వారికి అప్పుల బాధల నుంచి విముక్తి
సింహ రాశి వారికి వైధృతి రాజయోగం ఒక పెద్ద ఊరటగా మారబోతోంది. ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులను ఈ యోగం పూర్తిగా మార్చేస్తుంది. చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతారు. దీర్ఘకాలికంగా ఉన్న అప్పులు తీరిపోయి ప్రశాంతత లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి సరికొత్త డీల్స్ కుదురుతాయి. దీనివల్ల లాభాల బాట పడతారు. మీ మాట తీరు, సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. ఎటువంటి ఆందోళనలు లేకుండా జీవితంలో ముందడుగు వేస్తారు.
ధనస్సు రాశి వారికి కష్టాలన్నీ దూరం
ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఈ గ్రహాల సంచారం అపారమైన ప్రయోజనాలను తీసుకువస్తుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కే రోజులు వచ్చేశాయి. గతంలో మీరు పడిన కష్టాలన్నింటికీ ఈ సమయంలో శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయి. చేతిలో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్థికంగా స్థిరపడతారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు ఊపందుకుని, కొత్త ప్రాజెక్టులు మీ చెంతకు చేరుతాయి.












Click it and Unblock the Notifications