ఆసెంబ్లీ: మార్క్ ఫెడ్ స్కామ్ పై దుమారం

బాలాజీ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్, యజమాని పేర్లు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సభ్యులు మాట వినకపోవడంతో డిప్యూటీ స్పీకర్ మనోహర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేసమైన తర్వాత సభ సద్దుమణగలేదు. కడపలో ప్రభుత్వం లేదని డిఎల్ రవీంద్రా రెడ్డి విమర్శించారు. సీనియర్ అధికారితో విచారణ జరిపిస్తామని సభ తిరిగి సమావేశమైన తర్వాత మంత్రి రఘువీరా రెడ్డి హామీ ఇచ్చారు. అయినా సభ్యులు వినలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ మరో ప్రశ్నను గందరగోళం మధ్యనే చేపట్టారు. కడప జిల్లాలో మార్క్ ఫెడ్ వ్యవహారంపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని తెలుగుదేశం సభ్యుడు రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వం నిసిగ్గుగా వ్యవహరిస్తోందని దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు.












Click it and Unblock the Notifications