విజయ్ కు మద్దతుగా స్టాలిన్ ..! కేంద్రానికి భారీ ఝలక్..!

తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ అనూహ్య విజయం సాధించడం, డీఎంకే ఓటమి పాలవ్వడంతో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ విపక్షానికే పరిమితం అయ్యారు. అయితే విజయ్ కు ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ లభించకపోవడంతో తమ కూటమిలో ఉన్న పార్టీల్ని పంపి మరీ ప్రభుత్వం ఏర్పాటు చేయించారన్న ప్రచారం జరిగింది. అయితే అంతకు ముందే తమ కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్ కు మద్దతుగా వెళ్లిపోవడంపై మాత్రం స్టాలిన్ ఆగ్రహంగా ఉన్నారు. ఆ కోపంతో విజయ్, కాంగ్రెస్ ఇద్దరిపైనా స్టాలిన్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ మాత్రం విజయ్ తో ఓ విషయంలో స్టాలిన్ ఏకీభవించారు.

నీట్ సహా వివిధ జాతీయ స్దాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్న విద్యార్ధులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నీట్ లీక్ తర్వాత మరోసారి పరీక్ష నిర్వహించినట్లు కేంద్రం సమాధానమిస్తోంది. దీనిపై స్పందించిన విజయ్ (Vijay) పార్టీ టీవీకే (TVK) ఇవాళ అసలు నీట్ రద్దు చేస్తేనే సమస్యకు పరిష్కారం లభించినట్లు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే వైద్యవిద్యను కేంద్రం రాష్ట్రాలకు అప్పగించేయాలని కూడా కోరింది.

MK Stalin Joins Vijay in Calling for NEET Abolition Says It Alone Can Address Students Concerns

ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) సైతం ఇదే వాదన వినిపిస్తూ ట్వీట్ చేశారు. న్యూఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న నిరసన ఇప్పుడు యావత్ దేశ దృష్టిని ఆకర్షించిందని స్టాలిన్ ట్వీట్ లో పేర్కొన్నారు. నీట్ భారీస్థాయి అవకతవకలకు వీలు కల్పించేందుకే రూపొందించినట్లు హెచ్చరించిన మొదటి పార్టీ తామేనన్నారు. అందుకే, నీట్ వల్ల కలిగే ప్రమాదాలను నిరంతరం ఎత్తి చూపుతూ, డీఎంకే మొదటి నుంచీ దానిని వ్యతిరేకిస్తూ వస్తోందన్నారు.

MK Stalin Joins Vijay in Calling for NEET Abolition Says It Alone Can Address Students Concerns

సామాజిక న్యాయాన్ని పరిరక్షించడంలో భారతదేశానికి నాయకత్వం వహించి, మొదటి రాజ్యాంగ సవరణకు మార్గం సుగమం చేసిన తమిళనాడుకు నీట్ రద్దు అనే ఒకే ఒక డిమాండ్ ఉందన్నారు. ఇతర ఏ డిమాండ్ కన్నా ఎక్కువగా, నీట్ రద్దు ఈ నిరసనలకు కేంద్ర బిందువుగా ఉండాలన్నారు. నీట్‌ను రద్దు చేయడం మాత్రమే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుందన్నారు. అసలే విజయ్ కు వ్యతిరేకంగా ఉన్న స్టాలిన్ పార్టీ డీఎంకే మద్దతుతో డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోవాలని చూస్తున్న కేంద్రానికి ఈ పరిణామం షాకిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+