తెలుగు రాష్ట్రాల్లో ‘లెనిన్’ ఊచకోత.. ప్రభాస్‌తో సమానంగా నిలిచిన అఖిల్

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లవుతున్నా సరైన మాస్ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్‌కు 'లెనిన్' ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచే దండయాత్ర మొదలుపెట్టిన ఈ చిత్రం, విమర్శకుల ప్రశంసలతో పనిలేకుండా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ నరనరాల్లోకి ఎక్కిపోయింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.

బాక్సాఫీస్ వద్ద 'కోటి' మార్క్ విధ్వంసం!

కేవలం టాక్ మాత్రమే కాకుండా, లెనిన్ సాధిస్తున్న వసూళ్లు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 10 రోజుల పాటు రోజుకు రూ. 1 కోటికి పైగా షేర్ సాధించి ఈ ఏడాది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ అరుదైన ఘనత సాధించిన రేసులో ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' (11 రోజులు) తర్వాత అఖిల్ నిలవడం విశేషం. ఇదే లిస్ట్‌లో 'మన శంకర వర ప్రసాద్' (17 రోజులు) ప్రథమ స్థానంలో ఉండగా, 'పెద్ది' (14 రోజులు) రెండో స్థానంలో ఉన్నాయి. మొదటి రోజే రూ. 15 కోట్ల కలెక్షన్లతో గ్రాండ్ ఓపెనింగ్ సాధించిన లెనిన్, వీకెండ్స్‌తో పాటు వీక్‌డేస్‌లోనూ సాలిడ్ రన్ కొనసాగిస్తూ ఇప్పుడు ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌ దిశగా అడుగులు వేస్తోంది.

Lenin rampage in the Telugu states Akhil akkineni stands on par with Prabhas

వర్కవుట్ అయిన టికెట్ ధరలు

ఈ సినిమా విజయంలో మేజర్ ప్లస్ పాయింట్.. నార్మల్ టికెట్ రేట్లతోనే థియేటర్లలోకి తీసుకురావడం! భారీ టికెట్ ధరలతో ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్న సమయంలో, నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకు మాస్ సెంటర్లలో విపరీతమైన రష్ తెచ్చిపెట్టింది. మహాభారత పాత్రల ఛాయలతో సాగే కథనం, అఖిల్ వన్ మేన్ షో, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించాయి. కథ విషయానికొస్తే.. రాయలసీమలోని రామాపురం అనే ప్రశాంతమైన గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. పగలు, ప్రతీకారాలకు దూరంగా ఉండే ఆ ఊరిలోకి 'లెనిన్' అనే పదేళ్ల అనాథ పిల్లాడు అడుగుపెడతాడు. ఊరి పెద్దావిడ (ఈశ్వరీరావు) అతడిని సొంత కొడుకులా చేరదీస్తుంది. ఆమె కుమారుడు వసంత్ (ప్రమోద్ పంజు)తో లెనిన్‌కు ప్రాణస్నేహం ఏర్పడుతుంది.

రూ.100 కోట్లు అందుకుంటాడా?

అయితే, ఊహించని మలుపుల మధ్య జైలుకు వెళ్లిన లెనిన్, కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాక తన ప్రాణస్నేహితుడితో సహా ఊరిలోని వంద మందిని దారుణంగా నరికి చంపుతాడు. అప్పటివరకు రక్తం రుచే తెలియని ఆ పల్లె సీమలో లెనిన్ ఎందుకు అంతటి ఊచకోత కోశాడు? స్నేహానికి ప్రాణమిచ్చే ప్రశాంతమైన మనసు.. ద్రోహానికి బలవుతూ ఎంతటి నరమేధానికి దారితీసింది? అనే ఉత్కంఠభరితమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న లెనిన్‌కు ఈ వారం 'చెన్నై లవ్ స్టోరీ', 'జన నాయకుడు' వంటి పెద్ద సినిమాలు పోటీగా రాబోతున్నాయి. ఇప్పటికే సగం దూరం దాటేసిన లెనిన్, ఈ కొత్త సినిమాల పోటీని తట్టుకుని సెంచరీ మార్క్‌ను (రూ. 100 కోట్లు) అందుకుని అఖిల్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలుస్తాడో లేదో వేచి చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+